మద్యం కేసులో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదు

దిల్లీ మద్యం కేసును కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని.. దోషులు ఎంతటివారైనా శిక్ష పడుతుందని కేంద్ర మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షుడు రామ్‌దాస్‌ అథవాలె పేర్కొన్నారు.

Published : 05 Dec 2022 04:24 IST

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలె

సోమాజిగూడ, బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కేసును కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని.. దోషులు ఎంతటివారైనా శిక్ష పడుతుందని కేంద్ర మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షుడు రామ్‌దాస్‌ అథవాలె పేర్కొన్నారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఆదివారం బేగంపేటలో విలేకరులతో, ఆర్టీసీ కళాభవన్‌లో ఆర్‌పీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార చైతన్యసభలో మాట్లాడారు. తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ‘‘కేసీఆర్‌ జాతీయ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో మద్దతు లభించే అవకాశాలు లేవు’’ అని అన్నారు.  ప్రజాగాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయంతోనే పేదలకు మేలు చేకూరుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని