ఏటూరునాగారంలో ఎకోటూరిజం పునఃప్రారంభం

ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని ములుగు జిల్లా లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజం పునఃప్రారంభం అయినట్లు అటవీ శాఖ సోమవారం తెలిపింది.

Published : 06 Dec 2022 04:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని ములుగు జిల్లా లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజం పునఃప్రారంభం అయినట్లు అటవీ శాఖ సోమవారం తెలిపింది. కరోనా కారణంగా ఈ ప్రాంతంలో ఇన్నాళ్లు ప్రకృతి పర్యాటకం నిలిచిపోయింది. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించారు. తొలిదశలో తాడ్వాయి హట్స్‌తో పాటు లక్నవరం, బ్లాక్‌ బెర్రీ ఐలాండ్స్‌ దగ్గర సైక్లింగ్‌, ట్రెక్కింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు ములుగు జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్‌ వివరించారు. హైదరాబాద్‌ నుంచి ఈ పర్యాటక ప్రాంతాలు 250 కిమీ దూరంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని