మంత్రి కేటీఆర్‌తో బోయింగ్‌ బృందం భేటీ

అమెరికాకు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ అయిన బోయింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది.

Published : 06 Dec 2022 04:52 IST

అమెరికాకు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ అయిన బోయింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ బోయింగ్‌ ప్రతినిధి బృందాన్ని కోరారు. బోయింగ్‌ సంస్థ నూతన అధ్యక్షుడు బ్రెండన్‌ నెల్సన్‌, పదవీ విరమణ పొందిన పాత అధ్యక్షుడు మైఖేల్‌ ఆర్థర్‌, ఇతర ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తమకు అన్నివిధాలా సహకరించారంటూ పాత అధ్యక్షుడు మైఖేల్‌ను మంత్రి అభినందించారు. కొత్త అధ్యక్షుడు బ్రెండన్‌ నెల్సన్‌కు మంత్రి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వైమానిక విభాగం సంచాలకుడు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. పశువులు, జంతువుల ఆహార తయారీ సంస్థ మార్స్‌ పెట్‌కేర్‌ సంస్థ అధ్యక్షుడు ఇక్‌దీప్‌ సింగ్‌, ఇతర ప్రతినిధులు కూడా మంత్రిని ప్రగతిభవన్‌లో కలిసి తెలంగాణలో తమ పెట్టుబడుల గురించి చర్చించారు.

నేలకొండపల్లి బౌద్ధస్థూపాన్ని పునరుద్ధరిస్తాం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధస్థూపాన్ని పునరుద్ధరించి దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో తెలిపారు. బౌద్ధస్థూపం శిథిలమవుతోందని ఓ నెటిజన్‌ ట్విటర్‌ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన కేటీఆర్‌.. దాన్ని సందర్శించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని