Electricity Bill: రీడింగ్ ఆలస్యమైతే ఇలా లెక్కిస్తారు: సీఎండీ
కరెంటు బిల్లుల జారీలో ఆలస్యంతో శ్లాబు మారిపోతుందనే ప్రచారంలో నిజం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు.
ఈనాడు, హైదరాబాద్: కరెంటు బిల్లుల జారీలో ఆలస్యంతో శ్లాబు మారిపోతుందనే ప్రచారంలో నిజం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
* ఉదాహరణకు ఒక వినియోగదారు 222 యూనిట్లు వాడారు. ఆ నెల ప్రకారం 31 రోజులకు బిల్లు చేయాలి. కానీ 35 రోజులకు రీడింగ్ తీశారు. అప్పుడు.. 222 యూనిట్లను 35 రోజులతో భాగిస్తే.. ఒక్కరోజులో కాల్చే యూనిట్ల సగటు 6.34 వస్తుంది. దీన్ని ఆ నెలలో మొత్తం రోజులు 31తో గుణిస్తే 197 యూనిట్లు వచ్చింది.
* 200 యనిట్లలోపు ఉన్నందున ఆ ప్రకారమే బిల్లు ఇస్తారు. మామూలుగా అయితే 1 నుంచి 100 యూనిట్ల వరకు ఒక శ్లాబు, 101 నుంచి 200 వరకు మరో శ్లాబుగా ఉంటుంది. కానీ ఆలస్యం కారణంగా 200 యూనిట్లు దాటినందున పెరిగిన దామాషాలో 1 నుంచి 100 యూనిట్ల వరకు ఉన్న శ్లాబును పెంచుతారు. 222 యూనిట్ల ఉదాహరణలో 1 నుంచి 113 యూనిట్ల వరకు ఒకే రేటు ఉంటుంది. మిగిలిన యూనిట్లను రెండో శ్లాబులో పరిగణనలోకి తీసుకుంటారు.
* అంటే 1 నుంచి 113 యూనిట్ల వరకు రూ.3.80, 114 నుంచి 222 వరకు రూ.4.80 చొప్పున లెక్కించి బిల్లు తీస్తారు. 200 యూనిట్లు దాటినట్టుగా పరిగణించి 1 నుంచి 200 వరకు రూ.5.50 201 నుంచి 222 వరకు 7.20 చొప్పున లెక్కించరు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం