తాండూరు ఎక్స్‌ప్రెస్‌ రాయచూరుకు పొడిగింపు

మహారాష్ట్రలోని పర్భణి, నాందేడ్‌ నుంచి రాష్ట్రంలోని తాండూరు స్టేషన్‌ వరకు నడిచే తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను కర్ణాటకలోని రాయచూరు వరకు రైల్వేశాఖ పొడిగించింది.

Updated : 07 Dec 2022 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రలోని పర్భణి, నాందేడ్‌ నుంచి రాష్ట్రంలోని తాండూరు స్టేషన్‌ వరకు నడిచే తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను కర్ణాటకలోని రాయచూరు వరకు రైల్వేశాఖ పొడిగించింది. ఈమేరకు తాండూరు ఎక్స్‌ప్రెస్‌ (17663/17664) ప్రయాణ దూరం 177.98 కిలోమీటర్లు పెరిగింది. అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఈ పొడిగింపు ఉపయోగపడుతుందని, ప్రయాణం సులభతరం అవుతుందంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు ఇది దోహద పడుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని