మూసిన గనుల సమీపంలో కుంగిన భూమి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సౌత్‌, క్రాస్‌కట్‌ భూగర్భ గనుల సమీపంలో సోమవారం రాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కుంగింది.

Published : 07 Dec 2022 04:46 IST

నిర్వహణకు నీళ్లొదిలిన నేపథ్యం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
దరికి రావద్దంటూ సింగరేణి అధికారుల హెచ్చరికలు 

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సౌత్‌, క్రాస్‌కట్‌ భూగర్భ గనుల సమీపంలో సోమవారం రాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కుంగింది. ఎస్టేట్‌ సిబ్బంది మళ్లీ బోర్డు ఏర్పాటుచేసి సమీపానికి ప్రజలు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా 47 ఏళ్ల క్రితం సింగరేణి ఆధ్వర్యంలోని సౌత్‌, క్రాస్‌కట్‌ భూగర్భ గనులను మూసివేశారు. 1995-96 వరకు క్రాస్‌కట్‌లో ఆరు పంపులతో నీళ్లు తోడి బయటకు పంపేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత నిర్వహణను సింగరేణి సంస్థ గాలికి వదిలేయటంతో చుట్టూ అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. గని లోపలికి వెళ్లే, బయటకు వచ్చే మార్గాలు తప్ప అంతా ఆక్రమణకు గురైంది. గత వర్షాకాలంలో  భారీవర్షాలకు ఈ ప్రాంతంలో నీళ్లు ప్రవాహంలా ఉబికి వచ్చాయి. ఆ సమయంలో సింగరేణి అధికారులు ప్రమాదం సూచించే బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు. తాజాగా సోమవారం రాత్రి సమయంలో భూమి మళ్లీ ఒక్కసారిగా కుంగడంతో నీళ్లు పైకి కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని