తెలంగాణలో 17 ఖేలో ఇండియా కేంద్రాలు

దేశంలో క్రీడలను ప్రోత్సహించి వాటిని అభివృద్ధి పర్చడంతో పాటు ఒలింపిక్స్‌ వేదికపై భారత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Updated : 07 Dec 2022 05:51 IST

జిల్లాలు, అక్కడ శిక్షణ ఇచ్చే క్రీడలను ఎంపిక చేస్తూ కేంద్రం ఉత్తర్వులు

ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: దేశంలో క్రీడలను ప్రోత్సహించి వాటిని అభివృద్ధి పర్చడంతో పాటు ఒలింపిక్స్‌ వేదికపై భారత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందు కోసం భారత క్రీడా సంస్థ(సాయ్‌) ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు ‘ఖేలో ఇండియా’ ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా విడతల వారీగా ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 జిల్లాలకు ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే జిల్లాల్లో ఏ క్రీడాంశాల్లో క్రీడాకారులకు పట్టుందో వాటికే తొలి ప్రాధాన్యమిచ్చింది. ఆ ప్రాంతంలోనే కేంద్రం ఏర్పాటుకు సాయం అందించి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించనుంది. జిల్లాల్లో శిక్షకులు, కేంద్రాల ఏర్పాటుకు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ(డీఎస్‌ఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(శాట్స్‌) పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించింది.

ఎంపికైన జిల్లాలు, క్రీడాంశాలు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌- విలువిద్య; యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌, నల్గొండ-హాకీ; మెదక్‌, ములుగు, సిద్దిపేట-సైక్లింగ్‌; వనపర్తి-ఫుట్‌బాల్‌; నారాయణపేట్‌-అథ్లెటిక్స్‌; కామారెడ్డి-బ్యాడ్మింటన్‌; కరీంనగర్‌, వరంగల్‌-జూడో; హనుమకొండ-బాక్సింగ్‌; మహబూబాబాద్‌-ఖోఖో; సూర్యాపేట-కబడ్డీ.

సమకూరే ప్రయోజనాలు..

సీనియర్‌ క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు, అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన వారికి ఉపాధి అవకాశాలు నీ కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల మంజూరు నీ ఏటా ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు, శిక్షకుల వేతనాల కోసం రూ.3 లక్షల కేటాయింపు, క్రీడా పరికరాల పంపిణీ.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు