జనవరిలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

ఖమ్మం నగరంలోని లకారం చెరువులో రూ.4కోట్లతో శ్రీకృష్ణుడి రూపంలో ఆకట్టుకునే రీతిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Published : 07 Dec 2022 04:46 IST

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని లకారం చెరువులో రూ.4కోట్లతో శ్రీకృష్ణుడి రూపంలో ఆకట్టుకునే రీతిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాటిని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు, మాజీ అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, ఎలక్టెడ్‌ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌లు మాట్లాడారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విగ్రహం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో వనరులు సమకూర్చినట్టు పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు