సంక్షిప్త వార్తలు(7)

హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ గ్లోబల్‌ మీట్‌’ను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.వీరేశం, అలుమ్నీ మేనేజింగ్‌ ట్రస్టీ డా.ఎన్‌.కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు.

Updated : 08 Dec 2022 05:41 IST

ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ’ 11న

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ గ్లోబల్‌ మీట్‌’ను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.వీరేశం, అలుమ్నీ మేనేజింగ్‌ ట్రస్టీ డా.ఎన్‌.కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రతి రెండేళ్లకోసారి గ్లోబల్‌ మీట్‌ను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.


ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి: ట్రెసా

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్డీవో మధుమోహన్‌ తనను అవమానపరుస్తున్నారని ఇటీవల అక్కడి పురపాలక కమిషనర్‌ రజిత కళ్లనీళ్లు పెట్టుకున్న ఘటనపై కొంతమంది నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదని ట్రెసా అభిప్రాయపడింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌ తెలిపారు. ఈ సంఘటనపై కొందరు ఏకపక్షంగా మాట్లాడడం తగదని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్‌, శ్రీనివాసరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు.


సైనిక దళాల పతాక నిధికి విరాళాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు భారత సైనిక దళాల పతాక నిధికి విరాళాలు అందజేశారు. బుధవారం రాజ్‌భవన్‌, బీఆర్‌కే భవన్‌, హోంమంత్రి నివాసంలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వారు సైనిక సంక్షేమ శాఖ అధికారులకు విరాళాలు అందజేసి దేశరక్షణలో అసువులుబాసిన సైనికులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సైనిక సంక్షేమ శాఖ సంచాలకుడు కల్నల్‌ పి.రమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి: ట్రెసా

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్డీవో మధుమోహన్‌ తనను అవమానపరుస్తున్నారని ఇటీవల అక్కడి పురపాలక కమిషనర్‌ రజిత కళ్లనీళ్లు పెట్టుకున్న ఘటనపై కొంతమంది నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదని ట్రెసా అభిప్రాయపడింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌ తెలిపారు. ఈ సంఘటనపై కొందరు ఏకపక్షంగా మాట్లాడడం తగదని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్‌, శ్రీనివాసరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు.


ఎన్‌ఆర్‌ఐ అకాడమీ సోదాల్లో  53 దస్తావేజుల స్వాధీనం: ఈడీ

ఈనాడు, దిల్లీ: ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో జరిపిన సోదాల సందర్భంగా చరాస్థులకు సంబంధించిన 53 దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు సంబంధించిన కొంతమంది సభ్యులు, పదాధికారులపై పీఎంఎల్‌ఎ-2002 కింద నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ఈనెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌ల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకొని ఈ కేసులో భాగస్వాములైన వివిధ వ్యక్తుల ఆస్తులను జప్తు చేశారు.


బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సులకు నేటి నుంచి రెండోవిడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్‌, పీబీ బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీకి ఈనెల 8న ఉదయం 9 గంటల నుంచి 10న మధ్యాహ్నం 2 గంటల వరకూ రెండోవిడత ప్రవేశ ప్రక్రియను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తుది మెరిట్‌ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.


‘బిగ్‌ సి’ వార్షికోత్సవ ఆఫర్లు

ఈనాడు, అమరావతి: ‘బిగ్‌ సి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ లక్కీ డ్రా ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు తమ వద్ద స్మార్ట్‌ ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీడ్రా నిర్వహిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. ‘‘విజేతలకు 20 కార్లు, 20 ద్విచక్రవాహనాలు, 20 ఏసీలు, 20 రిఫ్రిజిరేటర్‌లు, 20 టీవీలు బహుమతిగా ఇస్తాం. మొబైల్‌ ఫోన్‌ కొనుగోలుపై బహుమతి, 10శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌, వడ్డీ, డౌన్‌పేమెంట్‌ లేకుండా కొనుగోలు చేసే సౌకర్యం ఉంది. స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్‌, యాక్సెసరీస్‌ కొనుగోలుపైనా బహుమతి ఉంటుంది’’ అని తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు