కొత్త కంది వంగడం విడుదల

వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి మరో కొత్త కంది వంగడం విడుదలైంది. దీనిని రూపొందించేందుకు వరంగల్‌ శాస్త్రవేత్తలు ఆరేళ్ల పాటు కృషిచేశారు.

Published : 08 Dec 2022 04:59 IST

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి మరో కొత్త కంది వంగడం విడుదలైంది. దీనిని రూపొందించేందుకు వరంగల్‌ శాస్త్రవేత్తలు ఆరేళ్ల పాటు కృషిచేశారు. 2021 యాసంగిలో పరిశోధనలు పూర్తి ఈ ఏడాది కంది వంగడాన్ని యాసంగిలో సాగు చేసుకునేందుకు విడుదల చేశారు. దీనికి వరంగల్‌ కంది-2 (డబ్ల్యూ ఆర్‌జీ-255) అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ డా.రావుల ఉమారెడ్డి వెల్లడించారు. పంటకాలం 170 నుంచి 180 రోజులని, 100 విత్తన గింజల బరువు 9 నుంచి 10 గ్రాములు ఉంటుందన్నారు. గింజ రకం మధ్యస్థ లావు, ఎరుపు రంగులో ఉంటుందని, ఏక పంటగా, అంతరపంటగా సాగు చేసుకోవచ్చని చెప్పారు. వానాకాలంలో నల్లరేగడి, బరువైన నేలల్లో సాగు చేసుకునేందుకు అనుకూలమన్నారు. వర్షాధారంగా సాగు చేస్తే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు, నీటి తడులతో సాగు చేస్తే ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఎండు తెగులును సమర్థంగా తట్టుకుంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని వాతావరణం, సాగు నేలలకు అనుకూలంగా ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని