జైలు నుంచి సింహయాజి విడుదల

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజి బుధవారం ఉదయం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదే కేసులో నందకుమార్‌, రామచంద్రభారతిలకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా సంబంధిత పత్రాలు జైలు అధికారులకు సమర్పించడంలో ఆలస్యమైంది.

Published : 08 Dec 2022 05:11 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజి బుధవారం ఉదయం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదే కేసులో నందకుమార్‌, రామచంద్రభారతిలకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా సంబంధిత పత్రాలు జైలు అధికారులకు సమర్పించడంలో ఆలస్యమైంది. వీరిద్దరూ గురువారం విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే రామచంద్రభారతిని నకిలీ పాస్‌పోర్టు కేసులో, నందకుమార్‌ను ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.   బెయిల్‌పై విడుదలైన వారు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించాలని, సిట్‌ అధికారుల దర్యాప్తునకు సహకరించాలని కోర్టు పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని బెదిరించరాదని, ప్రలోభపెట్టరాదని, న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం వీడకూడదని పేర్కొంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సిట్‌ అధికారుల ఎదుట హాజరు కావాలంటూ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సింహయాజి, నందకుమార్‌, రామచంద్రభారతి అక్టోబరు 28న అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వచ్చారు. ముగ్గురికీ హైకోర్టు డిసెంబరు 1న బెయిల్‌ మంజూరు చేసినా షరతులను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగింది.  ఒక్కొకరు రూ.3లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు రెండు పూచీకత్తులు న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని