పంచాయతీ కార్యదర్శులను శాశ్వత ప్రాతిపదికన నియమించొద్దు

ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలోని పంచాయతీ కార్యదర్శుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుందని, ఇకపై జిల్లా స్థాయిల్లో ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది.

Published : 08 Dec 2022 05:11 IST

పంచాయతీ రాజ్‌ శాఖ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలోని పంచాయతీ కార్యదర్శుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుందని, ఇకపై జిల్లా స్థాయిల్లో ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. కొందరు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారని, ఇలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ డైరెక్టరు హనుమంతరావు హెచ్చరించారు. అత్యవసరమైతే ముందస్తు అనుమతితో పొరుగు సేవల ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని