నేడు ఒకే కక్ష్యలోకి భూమి, సూర్యుడు, కుజుడు

భూమి, సూర్యుడు, కుజ గ్రహాలు గురువారం ఒకే కక్ష్య(సరళరేఖ)లోకి రాబోతున్నట్లు ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు.

Published : 08 Dec 2022 05:11 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: భూమి, సూర్యుడు, కుజ గ్రహాలు గురువారం ఒకే కక్ష్య(సరళరేఖ)లోకి రాబోతున్నట్లు ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు. ఉదయం 11:12 గంటలకు ఈ ఖగోళ విశేషం ఆవిష్కృతం అవుతుందన్నారు. ‘భూమికి దగ్గరగా రావడంతో కుజ గ్రహం పెద్దదిగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించిన తరువాత కూడా తూర్పు వైపు చిరకాంతితో దర్శనమిస్తుంది. ప్రతి 26 నెలలకోసారి ఇది పునరావృతం అవుతుంది. ఇప్పుడు కనిపించేంత కాంతిమంతంగా గ్రహాన్ని చూడాలంటే మరో తొమ్మిదేళ్లు ఆగాల్సి ఉంటుంది. ఈ ఖగోళ విశేషం వచ్చే ఏడాది జులై వరకు కనువిందు చేస్తుంది. రోజులు గడిచేకొద్దీ భూమికి, గ్రహానికి మధ్య దూరం పెరుగుతూకుజ గ్రహ కాంతి తగ్గుతూ వస్తుంది. దాన్ని వీక్షించేందుకు హైదరాబాద్‌ బోయినపల్లిలోని సెయింట్‌ ఆండ్రివ్స్‌ పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రఘునందన్‌రావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు