దేశంలో సగం ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు ఇక్కడే..

ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

Published : 08 Dec 2022 05:11 IST

ఈనాడు, దిల్లీ: ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 14,007 కేసులు నమోదుకాగా ఒక్క తెలంగాణలోనే 7,003 రిజిస్ట్టర్‌ అయ్యాయి. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు.


33.37%మేర పెరిగిన నూకల ఎగుమతులు

నూకల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 33.37% పెరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు. లోక్‌సభలో తెరాస ఎంపీలు కవిత మాలోతు, జి.రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌నేత అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 2021-22 ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్య 17.86 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎగుమతి కాగా, 2022-23లో అదే నెలల్లో ఆ ఎగుమతులు 23.82 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరినట్లు వెల్లడించారు.

రేషన్‌ బియ్యం పంపిణీలో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల తేడా

2019-20 నుంచి 2022-23 అక్టోబరు వరకు తెలంగాణలో రేషన్‌ బియ్యం పంపిణీలో 3,01,375 మెట్రిక్‌ టన్నుల తేడా ఉన్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కాలంలో ప్రజాపంపిణీ, జాతీయ ఆహారభద్రత  చట్టం కింద తెలంగాణ 46,08,218 మెట్రిక్‌ టన్నుల ఆహార గింజలు తీసుకొని 43,06,843 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసినట్లు చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని