తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఒక్క కేసూ లేదు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌లో నిలిచింది. 2017-22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 56 కేసులు నమోదుకాగా, అందులో 10 కేసులు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని వారిపైనే నమోదయ్యాయి.

Updated : 08 Dec 2022 05:31 IST

దేశవ్యాప్తంగా 56... ఏపీలోనే 10 సీబీఐ కేసుల నమోదు

ఈనాడు, దిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌లో నిలిచింది. 2017-22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 56 కేసులు నమోదుకాగా, అందులో 10 కేసులు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని వారిపైనే నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌(6), కేరళ(6)లు నిలిచాయి. తెలంగాణలోని ప్రజాప్రతినిధులపై ఒక్క కేసు కూడా లేదు. బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఈమేరకు సమాధానం ఇచ్చారు. 22 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలైనట్లు తెలిపారు. మొత్తం 11 పార్టీల ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయని, అందులో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, వైకాపా, ఆప్‌, ఆర్‌జేడీ, భాజపా, ఎస్‌పీ, ఏఐఏడీఎంకే, తెదేపా, జనసేన, ఎన్‌సీపీలు ఉన్నట్లు చెప్పారు. ఇందులో శిక్షల శాతం 2017లో 66.90, 2018లో 68, 2019లో 69.19, 2020లో 69.83, 2021లో 67.56 ఉన్నట్లు వెల్లడించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని