వాణిజ్యపన్నులశాఖ రాబడిలో 16 శాతం వృద్ధి

రాష్ట్రంలో వాణిజ్యపన్నులశాఖ రాబడిలో గత నవంబరు కంటే 16 శాతం వృద్ధిరేటు నమోదైంది. అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ ఆదాయం  పెరగడంతో నవంబరు నెలలో రూ.5,979 కోట్ల రాబడి నమోదైంది.

Published : 08 Dec 2022 05:38 IST

నవంబరు వరకు రూ.46,641 కోట్ల రాబడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాణిజ్యపన్నులశాఖ రాబడిలో గత నవంబరు కంటే 16 శాతం వృద్ధిరేటు నమోదైంది. అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ ఆదాయం  పెరగడంతో నవంబరు నెలలో రూ.5,979 కోట్ల రాబడి నమోదైంది. గత ఏడాది నవంబరు నెలలో రూ.5,143 కోట్ల ఆదాయం రాగా ఈసారి నవంబరులో రూ.836 కోట్ల రాబడి అధికంగా వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలలకు వాణిజ్య పన్నులశాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.46,641 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదికంటే రూ.4,253 కోట్ల ఆదాయం పెరగ్గా ఇది 10 శాతం అదనం. అమ్మకం పన్ను ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33వేల కోట్లు అంచనా వేయగా నవంబరు ఆఖరు వరకు రూ.20,038 కోట్ల రాబడి వచ్చింది. జీఎస్టీ ద్వారా రూ.42,189 కోట్లు అంచనా వేయగా మొదటి ఎనిమిది నెలల్లో రూ.26,603 కోట్ల ఆదాయం వచ్చింది. నవంబరు నెలలో పెట్రోలియం అమ్మకం పన్ను ద్వారా రూ.1,165 కోట్లు, మద్యం అమ్మకంపన్ను రూ.1,020 కోట్లు వచ్చాయి. జీఎస్టీ ద్వారా రూ.3,159 కోట్ల రాబడి వచ్చింది. నవంబరు వరకు రాబడులను వాణిజ్యపన్నులశాఖ విశ్లేషించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని