న్యాయమూర్తుల బదిలీలను నిలిపివేయాలి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ సిఫారసులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు.

Published : 08 Dec 2022 05:38 IST

ఏపీ హైకోర్టు వద్ద న్యాయవాదుల ర్యాలీ

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ సిఫారసులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు. బదిలీలను తక్షణం నిలిపివేయాలని నినాదాలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు కొలీజియం పునరాలోచన చేయాలని కోరారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని నినదించారు. అడ్వొకేట్స్‌ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు (వైకే), జడా శ్రావణ్‌కుమార్‌, డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్‌ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ క్యాంటిన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని