బుడగలా ఉబ్బి.. బురిడీ కొట్టేస్తుంది!

విశాఖ నగర పరిధి సాగర్‌నగర్‌ సమీపంలోని సముద్ర తీరంలో బుధవారం రెండు విభిన్న జీవులు కనిపించాయి.

Published : 08 Dec 2022 05:38 IST

విశాఖ నగర పరిధి సాగర్‌నగర్‌ సమీపంలోని సముద్ర తీరంలో బుధవారం రెండు విభిన్న జీవులు కనిపించాయి. సముద్రంలో చాలా లోపల ఉండే కప్ప జాతుల్లో ఇవి ఒకటని, వీటిని పఫర్‌ ఫిష్‌ అంటారని మత్స్యశాఖాధికారి డాక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. కీటకాలు, చిన్న చేపలను తింటూ మనుగడ సాగించే వీటిపై పెద్ద జీవులేవైనా దాడి చేస్తే బుడగలా ఉబ్బి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని వివరించారు. వీటిని తినరని, ఒక్కోటి సుమారు 5 కిలోలకు పైగా బరువు పెరుగుతుందన్నారు. జాలర్లు మాత్రం వీటిని సముద్ర కప్పలుగానే పిలుస్తారన్నారు. సందర్శకులు వీటిని కర్రల సాయంతో సురక్షితంగా సాగరంలోకి విడిచిపెట్టారు.

న్యూస్‌టుడే, సాగర్‌నగర్‌ (విశాఖపట్నం)

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు