దూరవిద్యలో.. కృత్రిమ మేధ
కృత్రిమ మేధ.. మెషిన్ లెర్నింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న కోర్సులు ఇవే.
జేఎన్టీయూలో ఆధునిక కోర్సులు
ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు, హైదరాబాద్: కృత్రిమ మేధ.. మెషిన్ లెర్నింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న కోర్సులు ఇవే. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండనున్న ఈ కోర్సుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ ఆధునిక కోర్సులను ఆసక్తి ఉన్నవారికి దూరవిద్య ద్వారా అందించాలని హైదరాబాద్ జేఎన్టీయూ నిర్ణయించింది. విద్యార్థులకే కాకుండా.. వృత్తివిద్య నిపుణులు, అధ్యాపకులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ కోర్సులను తీర్చిదిద్దింది. ఆయా అంశాల్లో తక్కువ సమయంలోనే పట్టు సాధించేలా రూపకల్పన చేసింది.
జేఎన్టీయూ ఇప్పటికే నిరంతర దూరవిద్య కేంద్రం తరఫున రెండు దశల్లో సర్టిఫికెట్ కోర్సులను అందించింది. తాజాగా ‘ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్’ కోర్సును ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సహా వివిధ అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17వ తేదీలోగా అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో 24వ తేదీ వరకు గడువు ఉన్నట్లు వివరించారు. త్వరలో ఎమర్జింగ్ టెక్నాలజీలకు సంబంధించి సరికొత్త కోర్సులను కూడా తీసుకురావాలని జేఎన్టీయూ భావిస్తోంది.
ఇవీ కోర్సుల వివరాలు..
* కృత్రిమ మేధ-మెషిన్ లెర్నింగ్(ఏఐ-ఎంఎల్): పైథాన్ ఫర్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
* ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్: సేఫ్టీ ఇన్ కామన్ ఇండస్ట్రీస్, సేఫ్టీ అండ్ ది లా, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్
* ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్: ఇండస్ట్రియల్ టెక్నిక్స్, మోడర్న్ ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: ఇంట్రడక్షన్ టు ఐవోటీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్, ఐవోటీ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫర్ ఐవోటీ, ఇండస్ట్రియల్ ఐవోటీ 5జీ అండ్ ఐవోటీ టెక్నాలజీస్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US- China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
Politics News
Nara Lokesh: 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను.. ఆ హామీ ఏమైంది?: నారా లోకేశ్
-
Movies News
SRK: సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు.. నేనూ అంతే : షారుఖ్ ఖాన్
-
India News
Ladakh: తూర్పు లద్దాఖ్ వద్ద వ్యూహాత్మక రహదారి నిర్మాణం ప్రారంభం
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
Sports News
IND Vs NZ : రెండో టీ20లో ఉమ్రాన్ స్థానంలో అతడిని తీసుకోవాలి : మాజీ క్రికెటర్