రోడ్డేశారు.. ఇళ్లను లోతట్టుకు నెట్టేశారు!

ఎక్కడైనా రహదారికి కాస్త ఎత్తులో ఇళ్లుంటాయి.. ఇకడేమో రోడ్డుకు ఏకంగా నాలుగడుగుల దిగువన కనిపిస్తాయి.

Updated : 09 Dec 2022 10:44 IST

ఈనాడు, హనుమకొండ; న్యూస్‌టుడే, ఐనవోలు: ఎక్కడైనా రహదారికి కాస్త ఎత్తులో ఇళ్లుంటాయి.. ఇకడేమో రోడ్డుకు ఏకంగా నాలుగడుగుల దిగువన కనిపిస్తాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌లోని పరిస్థితిది. నాలుగేళ్ల కిందట ఊరికి పెద్ద రోడ్డు వస్తుందని వారంతా సంబరపడ్డారు. అదే వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రహదారి నిర్మాణంలో దాని ఎత్తును ఏకంగా నాలుగడుగుల మేర పెంచారు. అప్పుడు గ్రామస్థులు అభ్యంతరం చెబితే రోడ్డుకు ఇరువైపులా డ్రైయిన్లు నిర్మించి నీళ్లు నిలవకుండా చూస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. ఆ మాట నేటికీ నీటిమూటగానే మిగిలింది. ఫలితంగా కిలోమీటరు పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఉన్న 40 కుటుంబాలు నరకయాతన పడుతున్నాయి. వానొస్తే చాలు.. రోడ్డు మీద నుంచి వరదంతా ఇళ్లలోకి వచ్చి చేరుతోంది.. దాన్ని మోటార్ల సాయంతో బయటకు ఎత్తిపోయాల్సిన దైన్యస్థితి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని