రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నియమితులయ్యారు.

Published : 09 Dec 2022 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. న్యాయవాది అయిన రవీందర్‌సింగ్‌ 2006లో తెరాసలో చేరారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. 2014లో కరీంనగర్‌ నగరపాలిక ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2021లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ తెరాసలో చేరారు. ఈ క్రమంలో రవీందర్‌ను పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకొన్నారు. మంత్రి గంగుల, రవీందర్‌లు విభేదాలు మరిచి కలిసి పనిచేసేందుకు వీలుగా రవీందర్‌సింగ్‌ను పౌరసరఫరాల సంస్థకు ఛైర్మన్‌గా నియమించినట్లు తెలుస్తోంది. తన నియామకంపై రవీందర్‌సింగ్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని