సంక్రాంతికి బస్సు రిజర్వేషన్లు షురూ

సంక్రాంతి పండగకు ఊరెళ్లాలంటే రైళ్లు సరిపోవడం లేదు. బెర్తులన్నీ ఎన్నడో నిండిపోయాయి. అందరి చూపూ ప్రత్యేక రైళ్లపైనే ఉంది.

Published : 09 Dec 2022 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్రాంతి పండగకు ఊరెళ్లాలంటే రైళ్లు సరిపోవడం లేదు. బెర్తులన్నీ ఎన్నడో నిండిపోయాయి. అందరి చూపూ ప్రత్యేక రైళ్లపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకొచ్చింది. గురువారం నుంచి రిజర్వేషన్లను ప్రారంభించింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. రిజర్వేషన్లకు అనుగుణంగా సరిపోయినన్ని బస్సులు సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని