ఏపీ మధ్యంతర దరఖాస్తుపై తెలంగాణ అభ్యంతరం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మధ్యంతర దరఖాస్తు (ఐఏ) దాఖలు చేయగా.. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది.
‘పాలమూరు-రంగారెడ్డి’పై ట్రైబ్యునల్ ఎదుట ఏపీ ఐఏ
ఈనాడు హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మధ్యంతర దరఖాస్తు (ఐఏ) దాఖలు చేయగా.. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈమేరకు ట్రైబ్యునల్‌లో జరుగుతున్న వాదనల సందర్భంగా ఏపీ గురువారం ఐఏ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి ఏమైనా అభ్యంతరం ఉంటే అపెక్స్ కౌన్సిల్లో లేవనెత్తాలి తప్ప ట్రైబ్యునల్ సరైన వేదిక కాదని తెలంగాణ పేర్కొంది. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించే 80 టీఎంసీలలో 45 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాల్సి ఉంది. సాగర్ ఎగువన కృష్ణాబేసిన్‌లో ఉన్నవి తెలంగాణ ప్రాజెక్టులే కాబట్టి ఈ 45 టీఎంసీలతోపాటు చిన్న నీటివనరులకు ఉన్న 89 టీఎంసీలలో వినియోగించుకోని 45 కలిపి 90 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ-246 జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తుపై ట్రైబ్యునల్ తెలంగాణకు నోటీసు జారీచేసి నాలుగు వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని సూచించింది. ఇది దాఖలు చేసిన తర్వాత రెండు వారాల్లోగా ఏపీ రిజాయిండర్ దాఖలు చేయాలని, 2023 జనవరి 24న దీనిపై వాదనలు వింటామని ట్రైబ్యునల్ పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పలు ప్రాజెక్టులపై తమకు అభ్యంతరం ఉన్నా తాము ట్రైబ్యునల్ ఎదుట ఎలాంటి దరఖాస్తు దాఖలు చేయలేదని, దీనికి కారణం ఇది సరైన వేదిక కాదనేనని తెలంగాణ పేర్కొంది.
న్యాయప్రక్రియ దుర్వినియోగం!
‘‘ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు, సదరన్ జోనల్ కౌన్సిల్ ఇలా అనేక వేదికల్లో పిటిషన్లు దాఖలు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ న్యాయప్రక్రియను దుర్వినియోగం చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో ఎలాంటి పనులు జరగడం లేదు’’ అని తెలంగాణ పేర్కొంది. 2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రతిపాదనను పరిశీలించారని, నిలుపుదల చేయాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలంగాణ ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా