వేధిస్తుంటే క్రీడాకారులు రాణించేదెలా: ఎంపీ పాటిల్‌

దేశంలో క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను వేధించే ధోరణి పెరిగిపోతోందని తెరాస ఎంపీ బీబీ పాటిల్‌ విమర్శించారు.

Published : 09 Dec 2022 05:40 IST

ఈనాడు, దిల్లీ: దేశంలో క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను వేధించే ధోరణి పెరిగిపోతోందని తెరాస ఎంపీ బీబీ పాటిల్‌ విమర్శించారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఓ బాక్సర్‌ను మానసిక వేధింపులకు గురిచేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదన్నారు. క్రీడాభివృద్ధిపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. క్రీడలపై కేంద్ర ప్రభుత్వంపై ఉదాసీనత వహించడం, మౌలిక వసతులు కల్పించకపోవడంతో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. కామారెడ్డిలో ఖేలో ఇండియా కేంద్రాన్ని నెలకొల్పాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని