1392 జేఎల్ పోస్టులకు ప్రకటన
రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది.
16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
జూన్ లేదా జులైలో పరీక్ష
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ (22/2022) విడుదల చేసింది. మల్టీజోన్-1లో 724, మల్టీజోన్-2లో 668 పోస్టులను భర్తీ చేయనుంది. కమిషన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా, తాజాగా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఈ నెల 16నుంచి 2023 జనవరి 6వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. పోస్టుల భర్తీకి రాతపరీక్ష 2023జూన్ లేదా జులైలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగప్రకటన పూర్తివివరాలు, అర్హతల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఆహార భద్రత అధికారుల పోస్టులకు మెరిట్ జాబితా విడుదల
ఈనాడు, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 24 ఆహార భద్రత అధికారుల (ఎఫ్ఎస్వో) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను, మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఎఫ్ఎస్వో పోస్టులకు నవంబరు 7న రాతపరీక్ష నిర్వహించి, డిసెంబరు 2న తుది కీని కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షకు 16,381 మంది దరఖాస్తు చేయగా, పేపర్-1, పేపర్-2 పరీక్షకు 9,368 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తుది జాబితా ప్రకటనకు ముందుగా మెరిట్‌లిస్టు ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నట్లు కమిషన్ తెలిపింది. అనంతరం తుది ఎంపిక జాబితాను వెల్లడించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
సాగర్‌లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్‌ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్‌పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్‌లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్‌వో పెంచింది. -
ఉపాధి హామీకి కూలీలను పెంచాలి
రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
రాజ్‌భవన్‌లో సీతారామ కల్యాణం
రాజ్‌భవన్‌లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సతీమణి సుమతి రాధాకృష్ణన్‌తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!