గోడ కూలింది.. పరదాయే దిక్కయ్యింది!

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో దుస్థితి ఇది.

Published : 10 Dec 2022 05:11 IST

న్యూస్‌టుడే, బీర్కూర్‌: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో దుస్థితి ఇది. 44 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 106 మంది బాలికలు, 106 మంది బాలురు చదువుతున్నారు. ఆరుగురు ఉపాధ్యాయినులు, ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల మూత్రశాల గోడ కూలడం,  పైన రేకులను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఉపాధ్యాయులు ఆ ప్రాంతంలో పరదాలు కట్టారు. ఆ పరదాల చాటునే నిత్యం బాలికలు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల ఈ పాఠశాలను ‘మన ఊరు- మన బడి’ కింద ఎంపిక చేయడంతో అభివృద్ధి పనులకు రూ.6.78 లక్షలు విడుదలయ్యాయి. అత్యవసరంగా మరుగుదొడ్లు కట్టించండి అని స్థానికులు కోరగా అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టడం కొసమెరుపు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు