Sangareddy: బట్వాడా చేయాల్సిన ఉత్తరాలు రెండేళ్లుగా బీపీఎం ఇంట్లో..

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం వాసర్‌ గ్రామంలోని పోస్టాఫీసును తపాలాశాఖ జిల్లా అధికారి(డిస్ట్రిక్ట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌) ఎస్‌వీఎల్‌ఎన్‌ రావు మంగళవారం తనిఖీ చేశారు.

Updated : 14 Dec 2022 08:55 IST

సిర్గాపూర్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం వాసర్‌ గ్రామంలోని పోస్టాఫీసును తపాలాశాఖ జిల్లా అధికారి(డిస్ట్రిక్ట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌) ఎస్‌వీఎల్‌ఎన్‌ రావు మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలో దస్త్రాలు లభించకపోవడంతో అనుమానంతో నారాయణఖేడ్‌లో బీపీఎం డానియల్‌ ఇంటికి వెళ్లి పరిశీలించారు. మూడు బస్తాల్లో రెండేళ్లుగా బట్వాడా(డెలివరీ) చేయని ఉత్తరాలు లభ్యమయ్యాయి.

వీటిలో 1,000 వరకు సాధారణ, 300 రిజిస్టర్‌ ఉత్తరాలు, ఆధార్‌ కార్డులు ఉన్నాయి. వాసర్‌ పోస్టాఫీసులో ఉండాల్సిన ఉత్తరాలు ఇంట్లో ఎందుకు ఉన్నాయని బీపీఎంపై అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాల బట్వాడా విషయంలో రెండు నెలల కిందట డానియల్‌ను హెచ్చరించినా ఆయన ధోరణిలో మార్పు రాలేదని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని.. బీపీఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఉత్తరాలను ప్రజలకు బట్వాడా చేస్తామన్నారు. తనిఖీల్లో పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు