Manohari Gold Tea: కిలో టీపొడి.. రూ.1.50 లక్షలు

అస్సాంలో మనోహరి గోల్డ్‌ టీ వేలంలో మరోసారి రికార్డుస్థాయి ధర పలికింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ టీ పొడిని కిలో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు.

Updated : 18 Dec 2022 07:42 IST

వేలంలో మనోహరి గోల్డ్‌ రకానికి రికార్డు ధర
కైవసం చేసుకున్న హైదరాబాదీ

అస్సాంలో మనోహరి గోల్డ్‌ టీ వేలంలో మరోసారి రికార్డుస్థాయి ధర పలికింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ టీ పొడిని కిలో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. గతేడాది దీని ధర రూ.99,999 పలికింది. మన దేశంలో చాయ్‌కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ అస్సాంలో పండే తేయాకుది ప్రత్యేక స్థానం. ఆ రాష్ట్రంలో ఏటా 65 కోట్ల కిలోలకు పైగా తేయాకు ఉత్పత్తవుతుంది. ఇది దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 52 శాతం. ఏటా పలు సంస్థలు అరుదైన రకాలకు చెందిన టీ పొడులను వేలం వేస్తుంటాయి. శనివారం మనోహరి గోల్డ్‌ టీ పొడికి వేలం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన నీలోఫర్‌ కేఫ్‌ యజమాని కె.బాబూరావు రూ.1.50 లక్షలకు దీన్ని కొనుగోలు చేసినట్లు మనోహరి టీ ఎస్టేట్‌ యజమాని రాజన్‌ లోహియా వెల్లడించారు. వేకువజామున 4 నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో టీ గార్డెన్‌లో ఒకే చెట్టుకు కాసిన మొగ్గ నుంచి సేకరించిన ఆకులతో ఈ టీ పొడిని తయారు చేస్తామని ఆయన తెలిపారు. మనోహరి గోల్డ్‌ టీ పొడితో తయారు చేసిన టీని రూ.1000కు కప్పు చొప్పున విక్రయిస్తామని బాబూరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని