సాట్స్‌, ఐడీసీ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఛైర్మన్‌గా సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) ఛైర్మన్‌గా ఈడిగ ఆంజనేయగౌడ్‌లు గురువారం తమ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు.

Published : 06 Jan 2023 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఛైర్మన్‌గా సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) ఛైర్మన్‌గా ఈడిగ ఆంజనేయగౌడ్‌లు గురువారం తమ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. సాట్స్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రీడలు, పశుసంవర్ధక శాఖల మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, బండా ప్రకాశ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీవ్‌సాగర్‌, బాలరాజుయాదవ్‌, శ్రీధర్‌రెడ్డి, సాయిచంద్‌లు పాల్గొని ఆంజనేయగౌడ్‌కు అభినందనలు తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ, త్వరలో తెలంగాణ క్రీడావిధానాన్ని ప్రవేశపెడతామన్నారు. కవిత మాట్లాడుతూ..ఉద్యమకారులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. ఐడీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేణుగోపాలాచారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌, ఐడీసీ ఎండీ విద్యాసాగర్‌రావు, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాసగుప్తా, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ, నీటిపారుదల రంగం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని