Hyderabad: వ్యవసాయ మేనేజ్‌మెంట్ డిగ్రీకి క్రేజ్.. ‘మేనేజ్’లో పీజీడీఎం చేసిన వారందరికీ జాబ్స్

వ్యవసాయ కోర్సులు పూర్తిచేసినవారికి సాఫ్ట్‌వేర్‌ కొలువులకు దీటుగా ఆకర్షణీయ ప్యాకేజీలతో ఉద్యోగాలొస్తున్నాయి.

Published : 24 Jan 2023 07:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ కోర్సులు పూర్తిచేసినవారికి సాఫ్ట్‌వేర్‌ కొలువులకు దీటుగా ఆకర్షణీయ ప్యాకేజీలతో ఉద్యోగాలొస్తున్నాయి. రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’ (మేనేజ్‌)లో ‘పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’(పీజీడీఎం) కోర్సు పూర్తిచేసిన 2021-23 బ్యాచ్‌లోని మొత్తం 66 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించాయి. దేశంలోనే ప్రముఖ కంపెనీలు రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని వీరికి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలిచ్చాయి.

గరిష్ఠంగా ఇద్దరికి ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీ లభించింది. ఐటీసీ, అదానీ క్యాపిటల్‌, మెక్‌ డొనాల్డ్స్‌, కోరమాండల్‌, బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌, క్రిసిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ వంటి 27 ప్రముఖ సంస్థలు వీరికి ఉద్యోగాలిచ్చాయని ‘మేనేజ్‌’ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర ‘ఈనాడు’కు చెప్పారు. సగటు వేతనం రూ.12.16 లక్షలు లభించిందని ఆయన వివరించారు. వ్యవసాయ వాణిజ్యం ప్రధాన అంశంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్‌ ర్యాంకుల ఆధారంగా ఈ కోర్సులో సీట్లు కేటాయిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు