జలసౌధలో ఉప గుత్తేదారుల రచ్చ!

నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో కొందరు ఉప గుత్తేదారులు రచ్చ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని జలసౌధ భవనంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక సీఈ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.

Updated : 25 Jan 2023 04:16 IST

సబ్‌కాంట్రాక్టు కేటాయింపు అంశంలో ఇంజినీర్లతో వాగ్వాదం  

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో కొందరు ఉప గుత్తేదారులు రచ్చ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని జలసౌధ భవనంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక సీఈ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రధాన గుత్తేదారు కింద పనులు చేస్తున్న కొందరు (సబ్‌ కాంట్రాక్టు) ఇంజినీర్లతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. చాలా కాలం నుంచి పనులు చేస్తున్నామని, పూర్తి స్థాయి కాంట్రాక్టు ఇప్పించాలని గట్టిగా మాట్లాడినట్లు సమాచారం. ప్రధాన గుత్తేదారుడు పనులు చేస్తుండగా సబ్‌కాంట్రాక్టు కింద అప్పగించడం కుదరదని ఇంజినీర్లు పేర్కొనగా.. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రధాన ఫీల్డుకొచ్చి ఎలా పనిచేస్తావో చూస్తామంటూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తులు ఓ ఇంజినీరును బెదిరించడం దారుణమంటూ నీటిపారుదల వర్గాలు చర్చించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు