విద్యుత్తు నియంత్రణ మండలి నిబంధనల ప్రకారమే ఏసీడీ

రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలిలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వినియోగదారులు ఒక ఏడాదిలో వినియోగించిన యూనిట్ల సరాసరిని లెక్కించి రెండు నెలల సగటు యూనిట్లకు సమానంగా అదనపు వినియోగ డిపాజిట్‌(ఏసీడీ)ను విద్యుత్తు సంస్థ వద్ద సెక్యూరిటీగా ఉంచుతామని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాలరావు వెల్లడించారు.

Updated : 25 Jan 2023 04:24 IST

వడ్డేపల్లి, న్యూస్‌టుడే : రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలిలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వినియోగదారులు ఒక ఏడాదిలో వినియోగించిన యూనిట్ల సరాసరిని లెక్కించి రెండు నెలల సగటు యూనిట్లకు సమానంగా అదనపు వినియోగ డిపాజిట్‌(ఏసీడీ)ను విద్యుత్తు సంస్థ వద్ద సెక్యూరిటీగా ఉంచుతామని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాలరావు వెల్లడించారు. మంగళవారం హనుమకొండలోని విద్యుత్తు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎండీ మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలు వస్తాయని చెప్పారు. ఈ జిల్లాల్లో బిల్లులు చెల్లించని కారణంగా కరెంటు తొలగించిన వినియోగదారులు 7,16,000 మంది ఉన్నారని, వారి నుంచి రూ.305 కోట్లు కంపెనీకి రావాల్సి ఉందన్నారు. ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుందని, దీనిని నివారించడానికి ఈఆర్‌సీ ఆదేశం ప్రకారం అదనపు సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేయడానికి జనవరి నెలలో నోటీసు ఇచ్చామన్నారు. ఏసీడీపై ఆర్‌బీఐ నిబంధన ప్రకారం వడ్డీరేటు లెక్కించి బిల్లులో సర్దుబాటు చేస్తామన్నారు. గృహ యజమానులే ఏసీడీ చెల్లించాలని, దీనిపై సందేహాలుంటే ఈఆర్‌సీ కేంద్రాలలో లేదా ఎన్పీడీసీఎల్‌ వెబ్‌సైటులో నౌ యువర్‌ ఎస్‌డీ అనే ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని