బాసర, వర్గల్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
వసంత పంచమిని పురస్కరించుకుని బాసర, వర్గల్లకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బుధ, గురువారాల్లో 108 ప్రత్యేక బస్సుల్ని నడపించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: వసంత పంచమిని పురస్కరించుకుని బాసర, వర్గల్లకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బుధ, గురువారాల్లో 108 ప్రత్యేక బస్సుల్ని నడపించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. నిర్మల్ జిల్లాలోని బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 బస్సులు ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హనుమకొండ నుంచి 5, కరీంగనర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సు వెళ్తాయి. వర్గల్‌కు సికింద్రాబాద్ గురుద్వార నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులు ఉంటాయి’ అని ఆర్టీసీ వివరించింది.
ఆదాయం పెంపు కోసం ఐఎస్బీతో ఒప్పందం
ఆదాయం పెంచుకోవడం, బస్ రూట్ల క్రమబద్ధీకరణపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. ఈ డేటాను విశ్లేషించేందుకు ఐఎస్బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)తో మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల సమక్షంలో డేటా సైన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ గంగ్వార్, ఆర్టీసీ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు