బదిలీకి కటాఫ్‌ తేదీ ఫిబ్రవరి 1

ఉపాధ్యాయుల బదిలీలకు 2023 ఫిబ్రవరి 1ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. అంటే ఆ తేదీ నాటికి ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 25 Jan 2023 05:04 IST

మూడేళ్లలోపు పదవీ విరమణ పొందే వారికి తప్పనిసరి బదిలీ ఉండదు
బదిలీల మార్గదర్శకాలపై జీఓ జారీకి మల్లగుల్లాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలకు 2023 ఫిబ్రవరి 1ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. అంటే ఆ తేదీ నాటికి ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి ఇంతకుముందు జనవరి 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించినా తాజాగా దాన్ని ఫిబ్రవరి 1వతేదీకి మార్చారు. ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలపై ప్రభుత్వం జీఓ జారీ చేయకున్నా కాపీని మాత్రం తాజాగా జరిగిన డీఈఓల సమావేశంలో అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తే ఇంకా పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

ముఖ్యమైన మార్గదర్శకాలు కొన్ని...

* మూడేళ్లలోపు పదవీవిరమణ అయ్యేవారికి తప్పనిసరి బదిలీనుంచిమినహాయింపు ఇస్తారు

* 50 ఏళ్లలోపు వయస్సుండి బాలికల పాఠశాలలో ఉన్న పురుష ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ. బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూలేని సందర్భంగా 50 ఏళ్లు వయసు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి

* స్పౌస్‌, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు ఇస్తారు. ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే వాటిని వినియోగించుకోవాలి

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌస్‌ వర్తింపు

* ఓడీ ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్లు

* ప్రాధాన్య కేటగిరీ వాడుకునేవారు 2023 జనవరి 1వ తేదీ తర్వాత తేదీల్లో జిల్లా మెడికల్‌ బోర్డు నుంచి పొందిన సర్టిఫికెట్‌ జత చేయాలి

ఉత్తమ పురస్కారాలు ఇచ్చింది బదిలీల కోసం కాదు

కనీసం జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు పొందినవారికి కూడా అదనపు పాయింట్లు ఎందుకు ఇవ్వడం లేదని ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా... ఉత్తమ పురస్కారాలు ఇచ్చింది బదిలీల్లో ప్రయోజనం పొందేందుకు కాదన్నారు. పురస్కారాలకు, బదిలీలకు సంబంధంలేదని స్పష్టంచేశారు. జాతీయ పురస్కారానికి ఇస్తే రాష్ట్రానికి, జిల్లాకు ఇవ్వాలని అడుగుతారని, ఇలా సమస్యలు వస్తాయని ఆ అధికారి చెప్పారు. అయితే 2015 వరకు జాతీయ, రాష్ట్ర పురస్కార గ్రహీతలకు అదనపు పాయింట్లు ఇచ్చారు. జీరో సర్వీస్‌ వాళ్లకు బదిలీ అవకాశం ఇవ్వడం లేదన్న ప్రశ్నకు ఇంకా మార్గదర్శకాల జీవో రాలేదు కదా? లేదని ఎలా ఉంటారని ప్రశ్నించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని