వందేభారత్‌లో జీఎం తనిఖీలు

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవేశపెట్టిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-విశాఖపట్నం)లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

Published : 25 Jan 2023 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవేశపెట్టిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-విశాఖపట్నం)లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌ గుప్తాతో కలిసి విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వరకు ఈ రైల్లో ప్రయాణించారు. ప్రయాణికులకు రైలులో కల్పించిన సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు సేవలు అందించే ఆన్‌బోర్డు సిబ్బందితోనూ మాట్లాడారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం వందేభారత్‌ ఇంజిన్‌లోకి వెళ్లి ట్రాక్‌, రైలు వేగాన్ని సైతం పరిశీలించారు. సెక్షన్‌ సిగ్నలింగ్‌, ట్రాక్‌ సామర్థ్యాలనూ చూశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని