Jee Main 2023: మధ్యస్థంగా జేఈఈ మెయిన్ ప్రశ్నలు.. సగం సమయం గణితం ప్రశ్నలకే..
తొలిరోజు జేఈఈ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం పట్టిందని, వాటికే దాదాపు సగం సమయం (80-90 నిమిషాలు) అవసరమైందని చెబుతున్నారు.
తొలిరోజు రెండు చోట్ల ఆలస్యంగా పరీక్ష ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, మల్లాపూర్: తొలిరోజు జేఈఈ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం పట్టిందని, వాటికే దాదాపు సగం సమయం (80-90 నిమిషాలు) అవసరమైందని చెబుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షలు ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి. పరీక్ష అంత కఠినంగా లేదని, తప్పకుండా జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధిస్తామని పలువురు విద్యార్థులు తెలిపారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు/పట్టణాల్లో ఈ పరీక్ష జరిగింది.
30 గణితం ప్రశ్నలకు 90 నిమిషాలు...
మొత్తం 300 మార్కుల ప్రశ్నపత్రంలో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల ప్రశ్నలు 90 ఇచ్చారు. అంటే ఒక్కో దాంట్లో 30 ప్రశ్నలు. గణితం ప్రశ్నలు అన్నింటినీ పరిష్కరించాలంటే 80-90 నిమిషాలు పడుతుందని శ్రీచైతన్య విద్యాసంస్థల జాతీయ ఐఐటీ కోఆర్డినేటర్ ఎం.ఉమాశంకర్ చెప్పారు. అందులో చాలామంది ఆరు ప్రశ్నలు చేయగలుగుతారన్నారు. ఎక్కువ మందికి 300కి 300 మార్కులు రాకుండా.. ఉన్నత ప్రమాణాలతో గణితం ప్రశ్నలు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా, రసాయనశాస్త్రం ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయని చెప్పారు. రసాయనశాస్త్రంలో అధికంగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి వచ్చాయని, అందులో ఎక్కువమంది 12 ప్రశ్నలకు జవాబులు గుర్తించగలుగుతారని తెలిపారు. కొన్ని ప్రశ్నలు గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని చెప్పారు. ర్యాంకింగ్లో గణితం, రసాయనశాస్త్రం ప్రశ్నలు కీలకంగా మారతాయన్నారు. గత ఏడాది గణితంతో పోల్చుకుంటే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని నానో అకాడమీ డైరెక్టర్ కాసుల కృష్ణ చైతన్య తెలిపారు. భౌతిక, రసాయన శాస్త్రాల్లో ప్రశ్నలు.. గత ఏడాది మాదిరిగానే సులభంగా ఉన్నాయని చెప్పారు.
* హైదరాబాద్లోని ఎల్బీనగర్ కేంద్రంలో పరీక్ష ప్రారంభం కావడం గంట ఆలస్యమైంది. దీంతో విద్యార్థులకు అదనంగా గంట సమయం కేటాయించారు. మౌలాలిలోని పరీక్ష కేంద్రంలోనూ అరగంట ఆలస్యం కాగా.. అక్కడ ఆమేర అదనపు సమయం ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Multiverses: ఇండస్ట్రీ నయా ట్రెండ్.. సినిమాటిక్ యూనివర్స్
-
World News
Pakistan: ఆత్మాహుతి దాడిలో 93కు పెరిగిన మృతులు.. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఘటన
-
Sports News
Team India: ధావన్ వస్తాడా...? ఇషాన్కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్ స్పందన ఇదీ..
-
General News
CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
India News
Economic Survey 2023: లోక్సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు