ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు వాహనాలు
విద్యుత్తు ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు వాహనాలను వినియోగించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది.
ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలన్న కేంద్రం
రాష్ట్రాలకు లేఖ
దశల వారీగా మార్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్ : విద్యుత్తు ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు వాహనాలను వినియోగించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర సూచనలు కార్యరూపంలోకి వస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్తు వాహనాలు కనిపించనున్నాయి. అయితే ఒక్కసారిగా వాహనాలను మార్చడం సాధ్యం కాదని.. దశల వారీగా వాటిని సమకూర్చుకోవాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ-2020-2030 పేరిట విధానాన్ని తీసుకువచ్చింది. విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసిన వారికి జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో రాయితీలు ఇచ్చింది. ఛార్జింగ్ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భావన అధికారుల్లో ఉంది.
కాలం చెల్లిన వాహనాలపై రవాణాశాఖ దృష్టి
కేంద్రం ఇటీవల 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు కింద మార్చాలని ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న వాహనాలను గుర్తించేందుకు రవాణాశాఖ రంగంలోకి దిగింది. 15 సంవత్సరాలు దాటిన వాహనాల వివరాలను ఆయా జిల్లా రవాణాశాఖ కార్యాలయాల నుంచి తెప్పించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరవాత పలువురు ఉన్నతాధికారులకు ప్రభుత్వం నూతన వాహనాలను సమకూర్చింది. అయినా కొన్ని పాత వాహనాలు ఉండే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. మరోవైపు నూతన సచివాలయ నిర్మాణం సందర్భంగా.. అధిక శాతం కార్యాలయాలను బీఆర్కే భవన్‌లోకి మార్చే సమయంలో 74 వాహనాలను ఏడాది కిందటే తుక్కుగా మార్చినట్లు ఓ అధికారి వివరించారు.
ఆర్టీసీలో అమలు ఎలా?
కేంద్రం సూచించిన విభాగాల్లో ప్రజారవాణా సంస్థలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో కేంద్ర నిర్ణయాన్ని అమలు చేయటం ఎంత మేరకు సాధ్యమన్నది ప్రశ్నగా ఉంది. ఆర్టీసీలో సుమారు మూడు వేలకుపైగా కాలం చెల్లిన బస్సులున్నట్లు సమాచారం.ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం చేసినా విద్యుత్తు బస్సులు ఒకే సారి కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు. కార్ల తరహాలో బహిరంగ మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేయలేమన్నారు. ఒప్పందం చేసుకున్నా.. బస్సులు ఇవ్వడానికి తయారీదారులకు కనీసం 9-12 నెలలు పడుతుందని చెబుతున్నారు. అధికారులు వినియోగించే వాహనాలు వరకు మార్చవచ్చంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్