నాగోబా జాతరలో ముగిసిన సంప్రదాయ పూజలు

ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవత పూజలను మెస్రం వంశీయులు మండ గాజిలి పూజలతో ముగించారు.

Published : 26 Jan 2023 04:24 IST

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవత పూజలను మెస్రం వంశీయులు మండ గాజిలి పూజలతో ముగించారు. నాగోబా జాతర అధికారికంగా ఈ నెల 28 వరకు కొనసాగుతుందని మెస్రం వంశం పటేల్‌ మెస్రం వెంకట్‌రావు తెలిపారు. బుధవారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా ఆలయ పక్కన ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం మండ గాజిలి పూజలు నిర్వహించారు. నాగోబా దేవత పూజలకు తీసుకొచ్చిన మట్టి కుండలను, ప్రసాదాలను మెస్రం వంశీయుల్లోని 22 తెగల వారికి పంపిణీ చేశారు. తర్వాత బేతాళ్‌ పూజల అనంతరం కర్ర సాము విన్యాసాలను ప్రదర్శించారు. నాగోబా దేవుడికి సంప్రదాయ పూజలు ముగిసిన తర్వాత మెస్రం వంశస్థులు ఉట్నూరు మండలం శ్యాంపూర్‌ బుడుందేవ్‌ పూజలకు బయల్దేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని