అజ్మేర్‌ దర్గాకు సీఎం కేసీఆర్‌ చాదర్‌ సమర్పణ

అజ్మేర్‌ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్‌’ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడాది కూడా సమర్పించారు.

Published : 26 Jan 2023 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: అజ్మేర్‌ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్‌’ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్‌ను అజ్మేర్‌ దర్గాలో సమర్పించేందుకు కేసీఆర్‌ వక్ఫ్‌ బోర్డు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ షకీల్‌, గాదరి కిశోర్‌కుమార్‌, సుధీర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని