కుప్పిలి పద్మకు సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం

జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, మహాకవి డా.సి.నారాయణరెడ్డి, ఆయన సతీమణి సుశీలా నారాయణరెడ్డి పేరిట 39 ఏళ్ల కిందట నెలకొల్పిన సాహితీ పురస్కారానికి 2023 సంవత్సరానికిగాను ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మను ఎంపిక చేసినట్లు సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు పక్షాన, రసమయి సాంస్కృతిక సంస్థ స్థాపకులు డా.ఎం.కె.రాము ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 26 Jan 2023 06:35 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, మహాకవి డా.సి.నారాయణరెడ్డి, ఆయన సతీమణి సుశీలా నారాయణరెడ్డి పేరిట 39 ఏళ్ల కిందట నెలకొల్పిన సాహితీ పురస్కారానికి 2023 సంవత్సరానికిగాను ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మను ఎంపిక చేసినట్లు సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు పక్షాన, రసమయి సాంస్కృతిక సంస్థ స్థాపకులు డా.ఎం.కె.రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న రవీంద్రభారతిలో జరిగే పురస్కార ప్రదానోత్సవానికి రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, టి.సుబ్బరామిరెడ్డి, డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, వాడ్రేవు చినవీరభద్రుడు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. పురస్కారం కింద రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక బహూకరించనున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని