అరుణ్ రామచంద్ర పిళ్లై భూమి జప్తు
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని రూ.2.25 కోట్ల విలువైన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
దిల్లీ మద్యం కేసులో నిందితుల ఆస్తుల సీజ్
ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని రూ.2.25 కోట్ల విలువైన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. దిల్లీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న పిళ్లైతో పాటు సమీర్ మహేంద్రు, అమిత్ అరోడా, విజయ్ నాయర్, దినేష్ అరోడాలతో పాటు సమీర్ మహేంద్రు భార్య గీతిక మహేంద్రు, ఇండోస్పిరిట్‌కు సంబంధించిన స్థిర,చర ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమీర్ మహేంద్రు, గీతిక మహేంద్రులకు చెందిన దిల్లీలోని రూ.35 కోట్ల విలువైన ఇల్లు, గురుగ్రామ్ మగ్నోలియాస్‌లోని అమిత్ అరోడా నివాసం (రూ.7.68 కోట్లు), ముంబయి పార్లేలోని విజయ్ నాయర్ ఇల్లు (రూ.1.77 కోట్లు), దినేష్ అరోడాకు చెందిన చికా, లా రోసా, అన్‌ప్లగ్‌డ్ కోర్టుయార్డ్ రెస్టారెంట్లు (రూ.3.18 కోట్లు), ఇండోసిర్పిట్‌కు చెందిన 50 వాహనాలు (రూ.10.23 కోట్లు), బ్యాంకు ఖాతాలు/ఫిక్స్‌డ్ డిపాజిట్లు(రూ.14.39 కోట్లు), తదితరాలు కలిపి మొత్తంగా రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
బెయిల్ పిటిషన్లపై 9న తీర్పు
దిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ చలామణీ వ్యతిరేకం చట్టం కింద అరెస్టయిన నిందితుల బెయిల్ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం వాదనలు సాగాయి. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బోయినపల్లి అభిషేక్ సహా అయిదుగురు నిందితులు తిహాడ్ జైలులో ఉన్న విషయం విదితమే. వారి బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక జడ్జి ఎం.కే.నాగ్‌పాల్ బుధవారం మరోసారి విచారణ నిర్వహించారు. తీర్పును రిజర్వు చేశామని, ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం తీర్పు వెలువరిస్తానని ప్రత్యేక జడ్జి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MIW vs RCBW: విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ
-
India News
Amritpal Singh: టోల్‌ప్లాజా వద్ద కారులో అమృత్‌పాల్ సింగ్..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం