ఏసీడీ ఛార్జీలు చెల్లించాల్సిందే

అదనపు వినియోగ డిపాజిట్‌(ఏసీడీ) ఛార్జీలు కచ్చితంగా చెల్లించాల్సిందేనని విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌ శ్రీరంగారావు స్పష్టం చేశారు.

Published : 26 Jan 2023 04:24 IST

ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు

భగత్‌నగర్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: అదనపు వినియోగ డిపాజిట్‌(ఏసీడీ) ఛార్జీలు కచ్చితంగా చెల్లించాల్సిందేనని విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌ శ్రీరంగారావు స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్‌లోని విద్యుత్తు సంస్థ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా ఏసీడీ ఛార్జీలపై అపోహలతో ఉద్యమిస్తూ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ బంధించడం సమంజసం కాదన్నారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్‌-2004 సెక్షన్‌ 47, 6/2004కు అనుగుణంగా పంపిణీ సంస్థలకు వసూలు చేసుకునే అధికారం ఉందని, ఈఆర్‌సీ ఆదేశాలను పంపిణీ సంస్థలు అమలు చేస్తున్నాయన్నారు.   ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 715 లక్షల సర్వీసులు ఉండగా రూ.305 కోట్ల బకాయిలు మిగిలాయన్నారు. ఇదే రెండు నెలల డిపాజిట్‌ ఉంటే బకాయిదారులు మిగిలేవారు కాదన్నారు. నష్టాన్ని రాబట్టుకోవడానికి ఎన్‌పీడీసీఎల్‌ సంస్థ ఈఆర్‌సీ ముందు పెట్టుకున్న ఆర్జీతో.. ఈ బకాయిలను నిజాయితీగా చెల్లిస్తున్న వినియోగదారులపై భారం వేయక తప్పడం లేదన్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏసీడీ డిపాజిట్‌ చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా తొలగించే అధికారం కంపెనీలకు ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని