సాయుధ దళాల ఫ్లాగ్‌డే ఫండ్‌కు ఎస్‌బీఐ రూ.33.78 లక్షల విరాళం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ (హైదరాబాద్‌) సర్కిల్‌ అధికారులు, ఉద్యోగులు.. సాయుధ దళాల ఫ్లాగ్‌డే ఫండ్‌కు రూ. 33.78 లక్షల విరాళాన్ని అందజేశారు.

Published : 26 Jan 2023 04:24 IST

గవర్నర్‌కు చెక్కు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ (హైదరాబాద్‌) సర్కిల్‌ అధికారులు, ఉద్యోగులు.. సాయుధ దళాల ఫ్లాగ్‌డే ఫండ్‌కు రూ. 33.78 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌, జీఎం మంజుశర్మ, డీజీఎం జితేంద్రకుమార్‌ శర్మ, ఏజీఎంలు సిసుగోస్వామి, పల్లంరాజులతో కలిసి చెక్కును రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ సంచాలకుడు రమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు