కేటీఆర్‌ ట్విటర్‌ ఖాతాలో మార్పులు

తెరాస భారత్‌ రాష్ట్రసమితిగా మారిన నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాండిల్‌లో మార్పులు చేశారు.

Published : 26 Jan 2023 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస భారత్‌ రాష్ట్రసమితిగా మారిన నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాండిల్‌లో మార్పులు చేశారు. గతంలో ‘కేటీఆర్‌టీఆర్‌ఎస్‌’ పేరిట ఉండగా... దానిని ఇప్పుడు ‘కేటీఆర్‌బీఆర్‌ఎస్‌’గా మార్చారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హోదాను ఆయన తన ప్రొఫైల్‌ నుంచి తొలగించారు. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు అనే హోదాలను ఆయన తన ప్రొఫైల్‌లో ఉంచారు. హ్యాండిల్‌ మారినందున ఆయన ట్విటర్‌లో ఉండే వెరిఫై (బ్లూ)టిక్‌ను తొలగించారు. పరిశీలన అనంతరం మళ్లీ ఆయనకు టిక్‌ను ఇవ్వనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు