తెలంగాణలో రోమన్ సంస్కృతి
తెలంగాణలో వివిధ దేశాల సంస్కృతి వర్ధిల్లుతోందని, రోమన్ సంస్కృతిని చాటేలా పామ్ ట్రీ (కొబ్బరి, ఖర్జూర, ఈత, తాటి, ఆయిల్‌పామ్ చెట్ల)ని తమ రాష్ట్రంలో విస్తృతంగా పెంచుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
భారీ ఎత్తున పామ్‌ట్రీల పెంపకం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో వివిధ దేశాల సంస్కృతి వర్ధిల్లుతోందని, రోమన్ సంస్కృతిని చాటేలా పామ్ ట్రీ (కొబ్బరి, ఖర్జూర, ఈత, తాటి, ఆయిల్‌పామ్ చెట్ల)ని తమ రాష్ట్రంలో విస్తృతంగా పెంచుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పర్యాటక రోడ్‌షోలో భాగంగా బుధవారం ఆయన ఇటలీ రాజధాని రోమ్‌ను అధికార బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పామ్ చెట్లను పరిశీలించారు. ప్రముఖ బొటానికల్ శాస్త్రవేత్త హాన్స్‌వాల్టర్‌లాక్ పామ్ చెట్ల చారిత్రక విశేషాలను తెలియజేస్తూ రాసిన బుక్ ఆఫ్ పామ్ పుస్తకాన్ని అధ్యయనం చేశారు. తెలంగాణలోనూ పామ్‌ట్రీల పెంపకం ఆది నుంచి జరుగుతోందని ఈ సందర్భంగా రోమ్ నగర పర్యాటక ప్రతినిధులకు తెలియజేశారు. ఎనిమిదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.75 కోట్ల ఈత, తాటి మొక్కలను నాటిందని వివరించారు. ఈత, తాటి చెట్ల నుంచి నీరా, బెల్లం, తేనె, సిరప్‌లను తయారు చేస్తున్నామన్నారు. తాటి, ఈత చెట్లతో పాటు ఖర్జూర, కొబ్బరి, జీలుగ చెట్ల నుంచి నీరాను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
India News
Karnataka: కోలార్ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Politics News
Karnataka polls: హంగ్‌కు ఛాన్స్‌లేదు.. ఎవరితోనూ పొత్తులుండవ్..: డీకేఎస్