ముందు గణతంత్రం.. తర్వాతే పెళ్లి మంత్రం..!

పెళ్లి మంత్రాలు ప్రారంభించడానికి అయిదు నిమిషాల ముందు ఓ రెండు యువ జంటలు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాయి.

Updated : 27 Jan 2023 05:07 IST

పెళ్లి మంత్రాలు ప్రారంభించడానికి అయిదు నిమిషాల ముందు ఓ రెండు యువ జంటలు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాయి. కల్యాణ మండపంలో పెళ్లి దుస్తుల్లోనే మువ్వన్నెల జెండాను ఎగురవేసి పెళ్లి రోజును మధుర జ్ఞాపకంగా మలుచుకున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన గండ్రత్‌ రేఖ(1వ వార్డు కౌన్సిలర్‌), కేశవ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేందర్‌కు భవానితో, చిన్నకుమారుడు నరేందర్‌కు సౌమ్యతో గురువారం వివాహం జరిపించడానికి నిశ్చయించారు. గణతంత్ర దినోత్సవం కావడంతో మండపం ఆవరణలోనే పతాకావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు వధువులు మండపానికి రాగానే వారు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఆ తర్వాతే పెళ్లి పీటలెక్కారు.

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌, కలెక్టరేట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు