నాగోబా ఆలయానికి పోటెత్తిన భక్తులు

నాగోబా దేవత దర్శనానికి భక్తులు బారులు తీరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సెలవు కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన, ఆటోలు, ఎడ్లబండ్లపై ఆలయానికి చేరుకున్నారు.

Published : 27 Jan 2023 05:04 IST

నాగోబా దేవత దర్శనానికి భక్తులు బారులు తీరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సెలవు కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన, ఆటోలు, ఎడ్లబండ్లపై ఆలయానికి చేరుకున్నారు. జాతర జరిగే కేస్లాపూర్‌ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. లక్ష మంది భక్తులు నాగోబాను దర్శించుకొని ఉంటారని అధికారులు అంచనా వేశారు. జనం రద్దీతో సమీప ముత్నూరు గ్రామంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని