కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలి

బీసీల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 28 Jan 2023 05:22 IST

ప్రధానికి లేఖ పంపిన జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: బీసీల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీకి మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.39 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా అందులో రూ.2 వేల 15 కోట్లను బీసీలకు కేటాయించి రూ.70 కోట్లనే ఖర్చు చేసిందన్నారు. బీసీల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని మోదీ.. బీసీలకు నిధుల కేటాయింపులో ఈసారి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని