ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియపై దృష్టి పెట్టండి

రాష్ట్రంలో ప్రారంభమైన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా కలెక్టర్లు అందరూ దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

Published : 28 Jan 2023 05:05 IST

కలెక్టర్లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన
తొలి విడత ‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రారంభమైన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా కలెక్టర్లు అందరూ దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బదిలీల ప్రక్రియ, ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై సమీక్షించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు ప్రకటించే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలి విడత ‘మన ఊరు- మన బడి’ కింద పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మండలానికి కనీసం రెండు పాఠశాలలను ఈ నెల 30 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. డ్యూయల్‌ డెస్క్‌లు, ఇతర ఫర్నిచర్‌ ఇప్పటికే ఆయా జిల్లాలకు సరఫరా ప్రారంభమైందని, మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాలకు అందుతాయని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు