నాబార్డు నుంచి మరో రూ.3 వేల కోట్ల రుణం

నాబార్డు నుంచి మరో రూ.మూడు వేల కోట్లను రుణంగా తీసుకోవాలని నిర్ణయించామని, అందులో నుంచి ప్రస్తుత వానాకాల సీజనులో కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు రూ.500 కోట్లు వెంటనే చెల్లించేలా తీర్మానించామని  రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 28 Jan 2023 05:05 IST

రైతులకు తక్షణమే రూ.500 కోట్ల చెల్లింపులు: రవీందర్‌సింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాబార్డు నుంచి మరో రూ.మూడు వేల కోట్లను రుణంగా తీసుకోవాలని నిర్ణయించామని, అందులో నుంచి ప్రస్తుత వానాకాల సీజనులో కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు రూ.500 కోట్లు వెంటనే చెల్లించేలా తీర్మానించామని  రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘యాసంగి వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన దృష్ట్యా రైతులు సొమ్ముల కోసం ఎదురుచూసే పరిస్థితి లేకుండా  నాబార్డు రుణం తీసుకోవాలని నిర్ణయించాం. వానాకాల సీజన్‌లో 9.65 లక్షల మంది రైతుల నుంచి 64.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.13,189 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.500 కోట్లు మినహా చెల్లించాం. తాజాగా తీసుకునే రుణం నుంచి ఆ మొత్తాన్ని చెల్లిస్తాం. మిగిలిన మొత్తాన్ని గతంలో తీసుకున్న స్వల్పకాలిక రుణాలను తిరిగి చెల్లించేందుకు వినియోగిస్తాం’ అని రవీందర్‌సింగ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని